
కొద్ది సంవత్సరాల క్రితం అందాల భామ శ్రియ సరన్ అంటే బాగా ఫేమస్. అలాగే తెలుగు తమిళ ఇండస్ట్రీల్లోని అందరు టాప్ హీరోలతో నటించేసింది.
కానీ కొద్ది సంవత్సరాలుగా ఆఫర్లు తగ్గడంతో పాపులారిటీ కూడా తగ్గింది. అలా అని శ్రియ ఆఫర్ల కోసం తెగ ట్రై చేయడం లేదు అలాగే వచ్చిన ఆఫర్లన్నిటికీ ఓకే చెప్పకుండా వచ్చిన వాటిలో సెలెక్టివ్ గా రోల్స్ ఎంచుకుంటోంది. అందులో భాగంగానే ఇటీవలే కన్నడ హీరో సరసన వచ్చిన ఆఫర్ ని కూడా వదులు కున్నారు.
శ్రియ త్వరలోనే అక్కినేని ఫ్యామిలీ హీరోస్ నటించిన ‘మనం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాకుండా చాలా తక్కువ సినిమాలు ప్రస్తుతం శ్రియ చేతిలో ఉన్నాయి.

