విదేశీ భర్తతో సీనియర్ హీరోయిన్ ఇక్కడే సెటిల్ !

Published on Jun 3, 2021 9:04 pm IST

సీనియర్ హీరోయిన్ శ్రియా పెళ్లి తర్వాత తన భర్త ఆండ్రీ కొశ్చెవ్ తో కలిసి స్పెయిన్ లోనే సెటిల్ అయింది. స్పెయిన్ లోని బార్సిలోనా నగరంలో మూడేళ్లు పాటు ఉండిపోయిన శ్రియా జంట, మొత్తానికి స్పెయిన్ ను వదిలేసి ఇండియాకి వచ్చేస్తున్నారు. 2018లో శ్రియా తన పెళ్లిని సింపుల్ గా ముంబైలో చేసుకుంది. పెళ్లి తరువాత ఎక్కువ కాలం స్పెయిన్ లోనే ఉంది.

మధ్యలో ఏదో సినిమా వస్తే.. షూటింగ్ వచ్చి వెళ్ళేది. ఇక నుండి ఇండియాలోనే ఉంటాం అని సోషల్ మీడియాలో ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి శ్రియా, తన భర్తతో ముంబైలోనే కాపురం పెడుతారట. మొదట శ్రియా భర్త ఒప్పుకోలేదు అని, అయితే శ్రియా కోసం ఇండియాలోనే కాపురానికి ఆమె భర్త ఒప్పుకున్నాడట. ఇక 37 ఏళ్ల శ్రియాకి ఇంకా పిల్లలు లేరు. ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్న శ్రియాకి ఇప్పట్లో పిల్లలను కనాలనే ఆలోచన లేదట.

సంబంధిత సమాచారం :