శృతి హాసన్ ఖాతాలో మరో బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్

Shruti-Haasan
సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియాలోనూ స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ కంటిన్యూ షెడ్యూల్స్ తో బిజీబిజీగా గడుపుతున్న హీరోయిన్ శృతి హాసన్. తను హిందీలో చేసిన గబ్బర్ సినిమా సమ్మర్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. మరో మూడు నెలల గ్యాప్ లోనే తను నటించిన ‘వెల్ కం బ్యాక్’ సినిమా సెప్టెంబర్ 4న రిలీజ్ కానుంది. ఇది కాకుండా యారా, రాకీ అనే రెండు హిందీ సినిమాల్లో నటిస్తున్న శృతి హాసన్ మరో బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ ని దక్కించుకుంది. అజయ్ దేవగన్ హీరోగా నటించనున్న ‘బాద్షాహో’ అనే సినిమాలో హీరోయిన్ గా శృతిని ఎంపిక చేసారు.

గతంలో ది ధర్టీ పిక్చర్ ని డైరెక్ట్ చేసిన మిలన్ లుత్రియా ఈ సినిమాకి డైరెక్టర్. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే శృతి హాసన్ తెలుగు, తమిళంలో కూడా స్టార్ హీరోలతోనే జతకడుతోంది. తమిళంలో విజయ్, అజిత్ లతో చెరో సినిమా చేస్తోంది. తెలుగులో మహేష్ బాబు సరసన నటించిన శ్రీమంతుడు సినిమా ఆగష్టు 7న రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ప్రస్తుతం శృతి హాసన్ అజిత్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. స్లోగా ప్రారంభమైన శృతి హాసన్ కెరీర్ గబ్బర్ సింగ్ సినిమాతో టర్న్ తీసుకొని ఇప్పుడు జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది.

Exit mobile version