
తెలుగు, తమిళం, హిందీ.. ఇలా అన్ని భాషల సినిమాలతో బిజీబిజీగా మారిపోయిన హీరోయిన్ శృతి హాసన్. ఇక వరుస సినిమాలతో ప్రస్తుతమున్న హీరోయిన్లలో టాప్ వరుసలో చేరిపోయిన శృతి.. అన్ని భాషల్లోని టాప్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూ దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. తమిళ సూపర్ స్టార్ అజిత్ కొత్త సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో శౌర్యం, దరువు సినిమాలతో మెప్పించిన దర్శకుడు శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను చిత్రీకరించేందుకు శృతి హాసన్ సినిమా యూనిట్‌తో కలిసి ఇటలీ బయలుదేరింది. గత కొన్ని రోజులుగా కొంత అస్వస్థతగా ఉన్నా శృతి హాసన్ అనుకున్న ప్రకారంగా షూటింగ్ పూర్తి చేసేందుకు సిద్ధమైపోవడం విశేషం. ఈనెల 15వరకు మియామి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సినిమా యూనిట్ తిరిగి ఇండియా ప్రయాణం కానుంది. ఇక మహేష్, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా రూపొందిన శ్రీమంతుడు ఆగష్టు 7న విడుదల కానున్న సంగతి తెలిసిందే!

