మహేష్ బాబు ‘ఒక్కడు’ సినిమాకు రీమేక్ గా హిందీలో ‘తేవర్’ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ ‘మదామియాన్..’ అనే స్పెషల్ సాంగ్ లో నర్తించింది. హిందీలో శృతి హాసన్ నటించిన ఫస్ట్ ఐటెం సాంగ్ అని అక్కడ మీడియా ప్రచారం చేస్తుంది.
అయితే ‘మదామియాన్..’ ఐటెం సాంగ్ కాదని శృతి హాసన్ పేర్కొంది. అదొక ఫన్నీ సాంగ్, స్పెషల్ ట్రాక్ అని చెప్పింది. త్వరలో ఈ సాంగ్ వీడియో విడుదల కానుంది. ‘మదామియాన్..’ పాటను మికా సింగ్, మమతా శర్మ పాడారు. ఈ సినిమాలో స్పెషల్ సాంగులో డాన్స్ చేయడమే కాదు, ఓ మెలోడీ సాంగును శృతి హాసన్ పాడడం విశేషం. అర్జున్ కపూర్, సోనాక్షి సిన్హా జంటగా నటించిన ఈ సినిమా జనవరి 9న విడుదలవుతుంది.
తెలుగులో మహేష్ బాబు, శృతి హాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.


