శృతి హాసన్ ఫ్యామిలీ.. ఇక్కొక్కరు ఒక్కో చోట

Published on Mar 25, 2020 10:00 pm IST

కరోనా వైరస్ నివారణలో భాగంగా ప్రజల్ని సామాజిక దూరం పాటించాలని వైద్యులు సూచిస్తున్న సంగతి తెలిసిందే. ఇక విదేశాల నుండి వచ్చే వారైతే 14 రోజులు స్వీయ నిర్భందంలో ఉండాలి. చాలామంది సెలబ్రిటీలు ఈ నియమాల్ని చాలా ఖచ్చితంగా పాటిస్తున్నారు. వారిలో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా ఉన్నారు. కొద్దిరోజుల క్రితమే లండన్ వెళ్లి వచ్చిన ఆమె తిరిగి వచ్చాక ముంబైలోని ఓ ఫ్లాట్లో ఒంటరిగా ఉంటున్నారు.

అలాగే ఆమె కుటుంబం మొత్తం ఈ నియమాన్ని పాటిస్తున్నారు. సామాజిక దూరం అంటే బయటివారితో మాత్రమే కాదని ఇంట్లో వారితో కూడ. అందుకే ఆమె తల్లి ముంబైలోనే ఉన్నా వేరుగా ఉంటున్నారు. ఇక ఆమె తండ్రి కమల్ హాసన్ చెన్నైలో ఒక్కరే వేరుగా ఉంటున్నారు. అలాగే ఆమె సోదరి అక్షర హాసన్ కూడా చెన్నైలోనే ఉన్నా తండ్రితో ఉండకుండా వేరుగా ఉంటోంది. ఇలా శృతి హాసన్ ఫ్యామిలీ మొత్తం ఒకరి నుండి ఒకరు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More