తమిళ సూపర్ స్టార్ విజయ్, శృతి హాసన్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘పులి’. ‘జిల్లా’, ‘కత్తి’ లాంటి రెండు వరుస బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పట్ల అంతటా భారీ క్రేజ్ ఉంది. చింబు దేవన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్నీ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో హన్సిక మరో హీరోయిన్‌గా నటిస్తోంది.
చాన్నాళ్ళ క్రితమే ఈ సినిమాపై దర్శకుడు కష్టపడుతూనే ఉన్నా.. సినిమా స్కేల్‌కు తగ్గట్టు అయ్యే ఖర్చు, బలమైన స్క్రిప్ట్ కోసం దీని కోసం చాలా కాలం శ్రమించాడు దర్శకుడు. ఇక గత నవంబర్ నెలలో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకూ శరవేగంగా సాగుతూ ఇప్పటికి టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ఇక మిగిలి ఉన్న పాటలను త్వరలోనే తెరకెక్కించనున్నారు. విజయ్ పుట్టినరోజున ఫస్ట్‌లుక్, ఆగష్టు 15న ట్రైలర్‌లను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 17న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.


