‘పటాస్’ బ్యూటీకి తెలుగులో మరో ఆఫర్..?

‘పటాస్’ బ్యూటీకి తెలుగులో మరో ఆఫర్..?

Published on Feb 3, 2015 12:18 PM IST

aadi-shruthi-sodi

పంజాబీలో రెండు మూడు సినిమాలు చేసిన అనుభవంతో తెలుగులో నందమూరి కళ్యాణ్ రామ్ సరసన ‘పటాస్’లో అవకాశం కొట్టేసింది ఒకప్పటి జర్నలిస్ట్ శృతి సోది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ నార్త్ ఇండియన్ బ్యూటీపై తెలుగు దర్శకనిర్మాతల కన్ను పడింది. తమ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని అప్పుడే కర్చీఫ్ వేయడానికి సిద్దమవుతున్నారట. హిట్ సెంటిమెంట్, కథ డిమాండ్ మేరకు బికినీ వేయడానికి అభ్యంతరం లేదని శృతి సోది చెప్పడం ఆమెకు ప్లస్ అయ్యింది.

‘భాయ్’ ఫేం వీరభధ్రమ్ చౌదరి దర్శకత్వంలో ఆది హీరోగా అనిల్ సుంకర ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం శృతి సోదిని సంప్రదించినట్టు సమాచారం. ఆమెను కలిసి కథ కూడా వినిపించారట. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గతంలో ఈ సినిమా వివరాలు ప్రకటించిన తర్వాత, మరో వార్త బయటకు రాలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు