బెల్లంకొండ శ్రీనివాస్ సరసన శృతి హాసన్..?

బెల్లంకొండ శ్రీనివాస్ సరసన శృతి హాసన్..?

Published on Aug 7, 2014 6:00 PM IST

Shruti-Haasan_Bellamkonda-S
‘అల్లుడు శీను’ సినిమాతో కుమారుడికి గ్రాండ్ లాంచ్ ఇచ్చారు నిర్మాత బెల్లంకొండ సురేష్. మాస్ హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ ను ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యారు దర్శకుడు వివి వినాయక్. విడుదలకు ముందు, విడుదల తర్వాత కూడా ‘అల్లుడు శీను’ సినిమా టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. సమంత, తమన్నా, చోట.కె.నాయుడు, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ ఇలా 24 క్రాఫ్ట్స్ లో టాప్ టెక్నీషియన్లు చేత పనిచేయించారు.

బెల్లంకొండ శ్రీనివాస్ రెండో సినిమాను కూడా చాలా భారి ఎత్తున నిర్మించబోతున్నారు. మాస్ పల్స్ బాగా తెలిసిన బోయపాటి శ్రీనివాస్ ‘అల్లుడు శీను’ రెండో సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుందని ఫిలిం నగర్ టాక్. ఇంకా అధికారికంగా దృవీకరించలేదు. త్వరలో ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. ఈ సినిమాను లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మిస్తారు.

తాజా వార్తలు