పవన్, మహేష్ లపై శృతి హాసన్ ఒక్క మాటలో తన వ్యూ.!

Published on Apr 14, 2021 7:19 pm IST


ఇప్పుడు మన దక్షిణాదిలో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో మల్టీ టాలెంటెడ్ అండ్ హ్యాపెనింగ్ బ్యూటీ శృతి హాసన్ ఇప్పుడు మళ్ళీ భారీ హిట్స్ తో తన హవా స్టార్ట్ చేసింది. అయితే మన టాలీవుడ్ లో ఆల్ మోస్ట్ అందరు స్టార్ హీరోస్ తో సినిమాలు చేసేసిన ఈ స్టార్ట్ హీరోయిన్ లేటెస్ట్ గా తన సోషల్ మీడియాలో ఫాలోవర్స్ తో ఇంట్రాక్ట్ అయ్యింది.

మరి ఇందులో తనకి మొట్టమొదటి హిట్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు ఆ హిట్ తో మరో భారీ హిట్ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబుల కోసం ఒక్క మాటలో తన వ్యూ చెప్పింది. మహేష్ కోసం చెబుతు ఒక్క మాటలో మహేష్ ఒక జెంటిల్ మెన్ అని పవన్ కోసం అయితే ఓ ఇతిహాసం(ఎపిక్) అన్నట్టుగా రిప్లై ఇచ్చింది. ఇక ఇప్పుడు శృతి హాసన్ మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో “సలార్” అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ తో పాటు మరిన్ని ఇతర సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :