స్క్రిప్ట్ రైటింగ్ పై దృష్టి పెట్టిన గ్లామర్ క్వీన్

స్క్రిప్ట్ రైటింగ్ పై దృష్టి పెట్టిన గ్లామర్ క్వీన్

Published on Feb 22, 2015 1:17 PM IST

Shruthi-hasan1 (1)
యూనివర్సల్ స్టార్ కుమార్తె, అటు సౌత్ ఇటు బాలీవుడ్ లో వరుస సినిమాలతో కెరీర్లో అత్యంత బిజీగా ఉన్న క్వీన్ శృతి హాసన్. శృతి హాసన్ మొదట సింగర్ గా, మ్యుజిషియన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత హీరోయిన్ గా పరిచయమై ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అటు సౌత్, ఇటు హిందీలో సినిమాలు చేస్తూ రెండు చోట్ల విజయాలను అందుకుంటూ దూసుకుపోతోంది. శృతి హాసన్ తదుపరి సినిమాలు అన్నీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోలతో ఉండడం విశేషం.

ఇదిలా ఉంటే శృతి హాసన్ తాజాగా తన మరో డ్రీం గురించి తెలియజేసింది. అదేమిటంటే కెరీర్లో ఎప్పటికైనా మెగా ఫోన్ పట్టుకొని డైరెక్టర్ అవ్వడం. ప్రసతుతం తన బిజీ షెడ్యూల్స్ లో తన డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి కాస్త సమయం కేటాయిస్తోంది. శృతి ఎట్టకేలకు స్క్రిప్ట్ రాయడానికి సిద్దమైంది. అలాగే త్వరలొఎ షార్ట్ ఫిల్మ్స్ చేయడానికి ఆసక్తి చూపుతోంది. ముందుగా షార్ట్ ఫిల్మ్స్ లో అనుభవం వచ్చాక తర్వాత ఫీచర్ ఫిల్మ్ చేస్తానని అంటోంది. శృతి హాసన్ ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు సరసన ఓ సినిమా చేస్తోంది.

తాజా వార్తలు