శృతి హాసన్ కు యూత్ ఐకాన్ అవార్డు

శృతి హాసన్ కు యూత్ ఐకాన్ అవార్డు

Published on Nov 19, 2014 1:06 PM IST

Shruthi-hasan1 (1)
తెలుగు, తమిళ, హిందీ భాషలలో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది శృతి హాసన్. తన అందంతో, అభినయంతో ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది.

‘యూత్ ఐకాన్’ ఎవరు..? అంటూ ఇటీవల ఆసియా విజన్ సంస్థ నిర్వహించిన ఒక పోల్ లో ఎక్కువ శాతం ప్రేక్షకులు శృతికి పట్టం కట్టారు. షార్జాలో జరిగిన ఆసియా విజన్ అవార్డు వేడుకలో శృతి హాసన్ ను ‘యూత్ ఐకాన్’ అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా తనకు మద్దతు తెలిపిన అభిమానులకు శృతి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు – కొరటాల శివ సినిమాలో శృతి నటిస్తుంది. హిందీలో ఠాగూర్ రీమేక్ ‘గబ్బర్’, తమిళంలో విజయ్ సరసన మరో సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా సమయాన్ని గడుపుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు