సలార్ లో ప్రభాస్ సరసన స్టార్ హీరోయిన్

Published on Jan 25, 2021 7:53 am IST

ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్న పాన్ ఇండియన్ గ్యాంగ్ స్టర్ డ్రామా సలార్. ఈ చిత్రం ఇటీవల హైదరాబాద్ లో పూజా కార్యక్రమ వేడుక కూడా నిర్వహించింది. అయితే ఈ చిత్రం ప్రకటించినప్పటి నుండి ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ బ్యూటీ దిశా పటాని నటించనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం లో శృతి హాసన్ లీడ్ రోల్ లో నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకూ శృతి హాసన్ మరియు ప్రభాస్ కలిసి నటించలేదు. అయితే వీరిద్దరి జంట స్క్రీన్ పై చూసేందుకు బావుంటుంది అంటూ పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఇప్పటికే శృతి హాసన్ ను సంప్రదించినట్లు సమాచారం. అయితే శృతి హాసన్ కూడా ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లో భాగం అయ్యేందుకు ఆతృత గా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :