తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బాగా బిజీబిజీగా గడుపుతున్న హీరోయిన్ శృతి హాసన్. శృతి హాసన్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మధ్య మధ్యలో తన బ్రాండ్స్ కి సంబందించిన యాడ్ షూటింగ్స్ మరియు తనకిష్టమైన మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటోంది. తాజాగా ఎయిడ్స్ పై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ట్రై చేస్తున్న ఓ వీడియోకి శృతి హాసన్ తన వాయిస్ ఓవర్ ని అందించింది.
త్వరలోనే టెక్ ఎయిడ్స్ అనే పేరుతో యానిమేషన్ చేసిన ఓ వీడియోని ఎయిడ్స్ పై అవేర్నెస్ తీసుకురావడానికి రూపొందిస్తున్నారు. ఆ వీడియోని మూడు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. దానికోసం నేషనల్ లెవల్లో గుర్తింపు ఉన్న హీరోయిన్ కోసం సెర్చ్ చేసి ఫైనల్ గా శృతి హాసన్ ని ఫైనలైజ్ చేసారు. శృతి హాసన్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంగ్లీష్, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యే ఈ యానిమేషన్ వీడియోకి శృతి వాయిస్ ఓవర్ అందిస్తోంది.
శృతి హాసన్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరబాద్ లో జరుగుతోంది. ఇది కాకుండా పలు హిందీ, తమిళ సినిమాలు చేస్తోంది.


