డీ గ్లామర్ పాత్రలో హాట్ బ్యూటీ

డీ గ్లామర్ పాత్రలో హాట్ బ్యూటీ

Published on Nov 30, 2015 7:48 PM IST

Shruthi-hasan1
అక్కినేని యువ హీరో నాగ చైతన్య ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసి తన తదుపరి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నాడు. నాగ చైతన్య ఈ ఏడాది మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ రీమేక్ లో నటించనున్నాడు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాని అధికారికంగా లాంచ్ చేసారు. డిసెంబర్ మొదటి వారంలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ వైజాగ్ లో మొదలు కానుంది. ముగ్గురు హీరోయిన్స్ ఉన్న ఈ సినిమాలో శృతి హాసన్ ఓ హీరోయిన్ గా కనిపించనుంది.

శృతి హాసన్ ఇప్పటివరకూ ఎక్కువగా గ్లామర్ రోల్స్ లో మోడ్రన్ డ్రెస్సుల్లో హాట్ హాట్ గా కనిపించిన శృతి హాసన్ ఈ సినిమాలో లెక్చరర్ గా ఓ డీ గ్లామర్ లుక్ లో కనిపించనుంది. అందులోనూ ఫుల్ శారీస్ కట్టుకొని ట్రెడిషనల్ లుక్ లో కనిపించనుంది. నటనకు ప్రాధాన్యం ఉన్న ఈ పాత్రలో శృతి హాసన్ ని సరికొత్తగా ప్రెజంట్ చేసేలా డైరెక్టర్ చందూ మొండేటి ప్లాన్ చేస్తున్నాడట. శృతి హాసన్ కాకుండా అనుపమ పరమేశ్వరన్, ఐషా శర్మలు హీరోయిన్స్ గా కనిపించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగార్జున, వెంకటేష్, నితిన్ లు అతిధి పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు