జూలై లో రానున్న శర్వా గ్యాంగ్ స్టర్ డ్రామా !

Published on Apr 21, 2019 4:00 am IST

ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్, ‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టర్ డ్రామా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇక ఈ చిత్రాన్నిజూలై లో విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో రెండు పాత్రల్లో కనిపించనున్నాడు శర్వా. అందులో ఒకటి యంగ్ స్టర్ కాగా మరొకటి మిడిల్ ఏజ్డ్ పాత్ర.

కాజల్ అగర్వాల్ , కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఈచిత్రానికి దళపతి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇక శర్వా ప్రస్తుతం 96 తెలుగు రీమేక్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రం యొక్క షూటింగ్ మారిషస్ లో జరుగుతుంది.

సంబంధిత సమాచారం :