దుబాయ్‌లో ‘శుద్ధ్ విలాస్’ బ్రాంచ్ గ్రాండ్ ఓపెనింగ్

దుబాయ్‌లో ‘శుద్ధ్ విలాస్’ బ్రాంచ్ గ్రాండ్ ఓపెనింగ్

Published on Mar 4, 2026 6:00 AM IST

Untitled 8 1

తెలుగు రాష్ట్రాలతో పాటు మలేషియాలోనూ భోజన ప్రియుల మన్ననలు పొందిన ‘శుద్ధ్ విలాస్’.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తమ విస్తరణను వేగవంతం చేసింది. ‘ట్రెడిషన్ సర్వ్డ్ ఇన్ స్టైల్’ అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఈ రెస్టారెంట్, మిడిల్ ఈస్ట్‌లో నివసిస్తున్న వారి కోసం దుబాయ్‌లో కొత్త బ్రాంచ్‌ను ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 20న ఈ నూతన శాఖ గ్రాండ్‌గా ప్రారంభమైంది.

దుబాయ్‌లోని డిస్కవరీ గార్డెన్స్, జెబెల్ అలీ విలేజ్ (స్ట్రీట్ నంబర్ 1, బిల్డింగ్ నంబర్ 12) వద్ద ఉన్న ఈ బ్రాంచ్ ప్రారంభోత్సవం శ్రీ శ్రీ శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి మార్గదర్శకత్వంలో ఘనంగా జరిగింది. ఈ బ్రాండ్ వ్యవస్థాపకులు శశికాంత్, శ్రీరామ్ కాగా.. దుబాయ్ బ్రాంచ్‌కు ప్రవీణ్, శ్రీనివాస్, వెంకట్ మార్తాండ్, సాగర్, హుస్సేన్ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు.

దుబాయ్ శాఖతో మిడిల్ ఈస్ట్‌లో భారీ విస్తరణకు ‘శుద్ధ్ విలాస్’ నాంది పలికింది. త్వరలో షార్జా, అబుదాబి, ఖతార్‌లలోనూ బ్రాంచీలు ఏర్పాటు చేయాలని సంస్థ యోచిస్తోంది. మరోవైపు హైదరాబాద్‌లోని అల్కాపురి టౌన్‌షిప్‌లోనూ కొత్త శాఖ ప్రారంభం కానుండగా.. వైజాగ్, విజయవాడల్లో ఏర్పాటుకు చర్చలు సాగుతున్నాయి. భవిష్యత్తులో అమెరికాతో పాటు ఆసియా, నార్త్ అమెరికా అంతటా తమ బ్రాండ్‌ను విస్తరించడమే లక్ష్యమని వ్యవస్థాపకులు వెల్లడించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు