
గత కొంత కాలంగా కంటిన్యూగా వార్తల్లో నిలిస్తున్న హీరోయిన్ రాధిక ఆప్టే. నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన ఈ భామ త్వరలోనే లయన్ సినిమాతో రానుంది. ఇది పక్కన పెడితే మొదటగా రాధిక ఆప్టే న్యూడ్ ఫోటోలు లీక్ అయ్యాయని వార్తల్లో నిలిచింది. ఆ విషయంపై క్లారిటీ ఇచ్చి కాస్త తేరుకొనే లోపే తను ఓ హాలీవుడ్ సినిమా కోసం చేసిన తన న్యూడ్ వీడియో నెట్ లో ప్రత్యక్షమైంది. దీంతో మళ్ళీ వార్తల్లో నిలిచింది.
ఈ విషయంలో రాధిక ఆప్టేకి సెక్స్ రాకెట్ లో ఇరుక్కున్న హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్ ఫుల్ సపోర్ట్ చేస్తోంది. అనురాగ్ కశ్యప్ రాధిక ఆప్టే న్యూడ్ సీన్ ని ఎంతో సెన్సిబుల్ గా డీల్ చేసి తీసాడు. అలాగే అనురాగ్ కశ్యప్ వాళ్ళు ఈ సినిమాని ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేయకూడదు అని తీసుకున్న నిర్ణయాన్ని నేను ఫుల్ సపోర్ట్ చేస్తున్నాని శ్వేత బసు అంటోంది. మరి శ్వేత బసు చేసిన ఈ విషయంపై ఎవరు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.

