టీజర్ కి రెడీ అవుతోన్న ‘శ్యామ్ సింఘ రాయ్’ !

Published on Mar 8, 2021 5:30 pm IST

నేచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘శ్యామ్ సింఘ రాయ్’. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఉగాది సందర్భంగా టీజర్ కూడా విడుదల కాబోతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన శ్యామ్ సింగరాయ్ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది.

కాగా ఈ సినిమా కథ ఫాంటసీ మిక్స్ అయి, ఎమోషనల్ గా సాగే పక్కా ఫిక్షనల్ డ్రామాగా సినిమా వుంటుందట. ఈ సినిమా పై సినిమా జనాల్లో కూడా బాగా ఆసక్తి ఉంది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో వినూత్నంగా ఉండబోతుందట. నాని మొదటి నుండి ప్రేక్షకులకు కాస్త వైవిధ్యమైన కథలు చెప్పడానికి.. మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. టక్ జగదీష్ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేసిన నాని.. ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమా షూటింగ్‌కు హాజరవుతున్నాడు.

సంబంధిత సమాచారం :