కోల్‌కతాలో షూట్ స్టార్ట్ చేసిన నాని !

కోల్‌కతాలో షూట్ స్టార్ట్ చేసిన నాని !

Published on Feb 15, 2021 9:16 AM IST

ShyamSinghaRoy

నేచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘శ్యామ్ సింఘ రాయ్’. కాగా ఈ చిత్ర యూనిట్‌ ఇప్పుడు కోల్‌కతాలో లాంగ్‌ షెడ్యూల్‌ చిత్రీకరణను స్టార్ట్ ‌ చేసింది. నాని – సాయిపల్లవిల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ తరువాత క్లైమాక్స్ ను హైదరాబాద్ లోని అల్యుమినియమ్ ఫ్యాక్టరీలో వేసిన పాతతరం కలకత్తా నేపథ్యం సెట్ లో షూట్ చేస్తారట.

ఇక ఈ క్లైమాక్స్ లో నానితో మిగిలిన నటీనటులు అందరూ పాల్గొనంటున్నారట. కాగా ఈ సినిమా కథ ఫాంటసీ మిక్స్ అయి, ఎమోషనల్ గా సాగే పక్కా ఫిక్షనల్ డ్రామాగా సినిమా వుంటుందట. ఈ సినిమా పై సినిమా జనాల్లో కూడా బాగా ఆసక్తి ఉంది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో వినూత్నంగా ఉండబోతుందట. నాని మొదటి నుండి ప్రేక్షకులకు కాస్త వైవిధ్యమైన కథలు చెప్పడానికి.. మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు