‘రోమియో’ సక్సెస్ పై కాన్ఫిడెంట్ గా ఉన్న సాయిరాం శంకర్

‘రోమియో’ సక్సెస్ పై కాన్ఫిడెంట్ గా ఉన్న సాయిరాం శంకర్

Published on Oct 8, 2014 1:06 PM IST

Sairam-Shankar-1
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తమ్ముడుగా హీరోగా పరిచయమైన హీరో సాయిరాం శంకర్. సాయిరాం శంకర్ హీరోగా చాలా సినిమాలు చేసినప్పటికీ తనకి బాగా గుర్తింపు తెచ్చి సక్సెస్ అయిన సినిమాలు మాత్రం తక్కువ ఉన్నాయి. ఆ సక్సెస్ అయిన అన్ని సినిమాలకు కూడా ఎక్కువ భాగం పూరినే కథ అందించడం విశేషం. ఇదే కోవలోనే పూరి కథ – డైలాగ్స్ అందించగా సాయిరాం శంకర్ హీరోగా నటించిన సినిమా ‘రోమియో’.

ఈ సినిమా చాలా రోజుల క్రితమే పూర్తయినప్పటికీ కొన్ని ఫైనాన్సియల్ ఇబ్బందుల వల్ల విడుదల ఆలస్యం అయ్యింది. అన్ని ఇబ్బందులను క్లియర్ చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 10న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ‘రోమియో కథ చాలా రోజుల క్రితమే రాసినప్పటికీ ప్రస్తుతానికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా ఉంటుంది. కచ్చితంగా విజయం సాధిస్తుంది, అంతే కాకుండా తన కెరీర్ కి బాగా హెల్ప్ అయ్యే సినిమా అని’ సాయిరాం శంకర్ అంటున్నాడు.

సాయిరాం శంకర్ సరసన అడోనిక హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ద్వారా పూరి అసిస్టెంట్ గోపి గణేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సునీల్ కశ్యప్ సంగీతం అందించాడు.

తాజా వార్తలు