సూర్య ‘ఎన్జీకె’ లో సాంగ్ పాడిన ట్యాలెంటెడ్ సింగర్ !

Sid Sriram

గీత గోవిందం చిత్రంలో ‘ఇంకేం ఇంకేం’ అనే సాంగ్ తో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు యువ గాయకుడు సిద్ శ్రీరామ్. ఈ సాంగ్ ఈ ఏడాదిలో నే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఇక ఇటీవల ఆయన పాడిన టాక్సీవాలా లోని ‘మాటేవినదుగా’ అలాగే హుషారు చిత్రంలోని ‘ఉండిపోరాదే’ అనే సాంగ్స్ సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తున్నాయి.

ఇక తాజాగా శ్రీరామ్ తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘ఎన్జీకె’ చిత్రంలో కూడా ఒక సాంగ్ పాడారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది లో ప్రేక్షకులముందుకు రానుంది.

Exit mobile version