సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించిన సరికొత్త పాట.. అదిరిందిగా..!

Published on Jun 29, 2021 2:03 am IST

సంగీత ప్రియులను ఈ మధ్య తన పాటలతో మంత్రముగ్ధులను చేస్తున్న సిధ్ శ్రీరామ్‌ తాజాగా మనందరి కోసం మరో అదిరిపోయే పాటను ఆలపించాడు. నకుల్‌ మెహతా, శ్వేతా మల్హోత్రా జంటగా ప్రేమ పంథాలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం “నువ్వంటే.. నేనని”. ఈ చిత్రానికి యాదిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే తాజాగా నేడు ఈ చిత్రానికి సంబంధించి ‘నమ్మవే చెలి’ లిరికల్ వీడియో సాంగ్‌ని ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్ చిత్రబృందానికి అభినందనలు కూడా తెలియచేశారు. అయితే ఈ పాటకు వరికుప్పల యాదగిరి సాహిత్యం అందించి, స్వరాలు అందించగా సిధ్ శ్రీరామ్‌ ఆలపించాడు. అయితే ఎప్పటిలాగానే సిధ్ ఈ పాటను కూడా ప్రాణం పెట్టి పాడినట్టు తెలుస్తుంది. సంగీత ప్రియులారా ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ పాటను ఒకసారి ఆలకించండి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :