సూపర్ హిట్ రీమేక్ లో సిద్దార్థ్ ?

Published on Dec 27, 2018 9:06 am IST


ఈఏడాది బాలీవుడ్ లో మంచి విజయం సాధించి అత్యంత ప్రజాధారణ పొందిన టాప్ 10 చిత్రాల్లో టాప్ ప్లేస్ లో నిలిచింది అంధధూన్. శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా , టబు , రాధికా ఆప్టే ముఖ్య పాత్రల్లో నటించారు.సుమారు 30కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 110 కోట్ల వసూళ్లను రాబట్టింది.

తాజాగా ఈచిత్రాన్ని సౌత్ లో రీమేక్ చేయాలనుకుంటున్నారు. అందుకోసం సిద్దార్థ్ ను హీరో గా తీసుకోవాలనుకుంటున్నారని సమాచారం. మరి ఈకామెడీ క్రైమ్ థ్రిల్లర్ కు సిద్దార్థ్ ఒప్పుకుంటారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :