
గతంలో వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఓ మై ఫ్రెండ్’ సినిమాలో – సిద్దార్థ్ హన్సిక తొలిసారి జతకట్టారు. సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం వీరిద్దరూ మళ్ళీ మరోసారి జతకడుతున్నారు. కుష్బూ సుందర్ నిర్మించనున్న ఈ సినిమాకి తమిళ్లో ‘తీయా వెలై సెయ్యనం కుమారు’ అనే టైటిల్ ని పెట్టారు ‘ చాలా కాలంగా సుందర్ గారితో పనిచెయ్యాలనుకుంటున్నాను. ఆ కోరిక ఇన్ని రోజులకి నెరవేరింది. అలాగే కమెడియన్ సంతానంతో కూడా కలిసి పనిచెయ్యాలనే కోరిక కూడా ఈ మూవీతో తీరనుంది. మరోసారి హన్సికతో కలిసి పనిచెయ్యనున్నాను. ఈ తమిళ సినిమాకి ‘తీయా వెలై సెయ్యనం కుమారు’ అనేది టైటిల్. సుందర్ గారికి నా కృతజ్ఞతలు అని’ సిద్దార్థ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో సిద్దార్థ్ హీరోగా నటిస్తున్న సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇది కాకుండా సిద్దార్థ్ తన సొంత బ్యానర్ పై తనే హీరోగా రెండు సినిమాలను నిర్మించనున్నారు. ఈ సినిమాల గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.
మళ్ళీ జతకడుతున్న సిద్దార్థ్ – హన్సిక
మళ్ళీ జతకడుతున్న సిద్దార్థ్ – హన్సిక
Published on Oct 26, 2012 3:25 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఇరుముడి’పై మ్యూజిక్ డైరెక్టర్ రివ్యూ.. సోది లేకుండా ఒక్క మాటలో
- విశ్వనాథ్ అండ్ సన్స్ : నాలుగు రోజుల్లోనే రూ.150 కోట్ల వసూళ్లు..!
- రూ.లక్ష బడ్జెట్.. రూ.20 కోట్ల వసూళ్లు: చెత్త సినిమా అంటూ ట్రోలింగ్.. థియేటర్లలో కలెక్షన్ల వర్షం!
- ‘టాక్సిక్’ చిత్రానికి ఏపీలో టికెట్ ధరల పెంపు..?
- సాలిడ్ ఓపెనింగ్స్ దిశగా ‘ఇరుముడి’.. రవితేజ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘విశ్వంభర’: చిన్నపాటి శబ్దం కూడా లేదే..
- వీక్ డేస్ లో కూడా ఆగని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. స్ట్రాంగ్ బుకింగ్స్
- రవితేజ ‘ఇరుముడి’ సెన్సార్ పూర్తి: సర్టిఫికెట్.. రన్టైమ్ డీటెయిల్స్!
- Official : సందీప్ కిషన్, జాసన్ సంజయ్ ‘సిగ్మా’ రిలీజ్ డేట్ ఖరారు
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- IND vs SL 1st Test: గాలె టెస్టులో టీమిండియా పట్టు.. లంకపై స్పిన్నర్ల పంజా.. భారత్కు భారీ లీడ్
- Nizam Collections : నైజాంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా: 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దిశగా మూవీ!
- ‘జైలర్ 2’తో క్లాష్ నుంచి తప్పుకున్న ధనుష్.. కానీ హ్యాట్రిక్ హీరోతో రెడీ?
- ‘అఖిల్’ తదుపరి కథ పై కొత్త చర్చ !
- అనిరుధ్, కావ్యల వివాహం.. డేట్, వెన్యూ ఫిక్స్ అయ్యిందా..?
- డైరెక్టర్గా మారిన హీరో.. అయినా వదలని ఫ్లాప్ సెంటిమెంట్..!
- ‘రామాయణ’ క్లైమాక్స్ పై క్రేజీ న్యూస్ !
- ఎన్టీఆర్తో వెంకీ అట్లూరి కాంబినేషన్.. సెట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్..!

