చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న సిద్దార్థ్ కి తమిళంలో ‘జిగార్తాండ’ రూపంలో ఓ మంచి హిట్ వచ్చింది. తమిళంలో ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సినిమా తెలుగులో ‘చిక్కడు దొరకడు’ గా రానుంది. ఓ కుర్రాడు సినిమా ఇండస్ట్రీలో ఓ గ్యాంగ్ స్టర్ మూవీ చెయ్యాలనుకుంటాడు. ఈ అంశం చుట్టే కథ తిరుగుతూ ఉంటుంది. గతంలో పిజ్జా లాంటి హర్రర్ సినిమా అందించిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.
కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాని రియల్ లైఫ్ లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ కి చెందిన ఓ బిగ్ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉంది. దీనికి సంబందించిన చర్చలు కూడా జరుగుతున్నాయని ఈ చిత్ర నిర్మాత తెలిపారు.


