సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) – 2026 వేడుక బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ అవార్డుల సంబరానికి దక్షిణాది సినీ తారలు విచ్చేసి సందడి చేశారు. ఈ వేడుకలో దక్షిణాది భాషల సంబంధించిన నటీనటులు హాజరై అలరించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో భాగంగా తొలిరోజు తెలుగు, కన్నడ సినిమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అవార్డులు అందుకున్నారు. మరి ‘సైమా’ 2026 అవార్డుల విజేతలు ఎవరో చూద్దాం రండి.
‘మిరాయ్’లో హీరోగా నటించిన తేజ సజ్జా ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు.
ఇక ఉత్తమ నటి (క్రిటిక్స్) అవార్డును ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో నటించిన ఐశ్వర్య రాజేశ్ కి దక్కింది.
ఉత్తమ హాస్యనటుడి అవార్డును బుల్లిరాజు అలియాస్ భీమల రేవంత్ దక్కింది. సంక్రాంతికి వస్తున్నాంలో నటనకు గానూ అతనికి దక్కింది.
ఇక ‘కాంతార: చాప్టర్1’లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను అలరించిన కన్నడ నటుడు రిషబ్శెట్టి ఉత్తమ నటుడి అవార్డు సొంతమైంది.
ఉత్తమ నటి (పరిచయ) -మోగ్లీ సినిమాకి గానూ సాక్షి మడోల్కర్ కి దక్కింది.
ఉత్తమ గేయ రచయిత: కోర్ట్ సినిమాకి గానూ పూర్ణా చారికి దక్కింది.
ఉత్తమ నటి (పరిచయ) – కోర్ట్ సినిమాకి గానూ శ్రీదేవి కి దక్కింది.
ఉత్తమ నటుడు (పరిచయ) – హర్ష్ రోషన్ (కోర్ట్)
ఉత్తమ సహాయ నటుడు – సత్యదేవ్ (కింగ్డమ్)
ఉత్తమ సహాయ నటి – శ్రద్ధా శ్రీనాథ్ (డాకు మహారాజ్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ -కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్)
ఉత్తమ నేపథ్య గాయకుడు -రమణ గోగుల (సంక్రాంతికి వస్తున్నాం)
ఉత్తమ నేపథ్య గాయని -సమీరా భరద్వాజ్ (కోర్ట్)


