నేచురల్ స్టార్ నాని హీరోగా, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కిన రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామా దసరా. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్న ఈ సినిమా లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా, దీక్షిత్ శెట్టి మరో కీలక పాత్రలో నటించారు.
మేకర్స్ నేడు ఈ చిత్రం నుండి సిల్క్ బార్ సీన్ ను విడుదల చేయడం జరిగింది. నాని బార్ లోకి ఎంటర్ అయ్యే సన్నివేశం ఇది. ఈ సన్నివేశానికి థియేటర్ల లో విజిల్స్, అరుపులతో దద్దరిల్లింది. సినిమా లో కీలక సన్నివేశం గా నిలిచిన ఈ సీన్ ను రిలీజ్ చేయడం తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. SLV సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


