నయనతారతో ఎలాంటి గొడవపడలేదంటోన్న శింబు

నయనతారతో ఎలాంటి గొడవపడలేదంటోన్న శింబు

Published on Sep 4, 2015 12:40 AM IST

simbu-nayanthara
తమిళ, తెలుగు భాషల్లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో శింబు గురించి ప్రత్యేకించి పరిచయమక్కర్లేదు. మూడేళ్ళుగా తన సినిమాలేవీ విడుదల కాని పరిస్థితుల నుంచి ఈ మధ్యే ‘వాలు’తో సూపర్ హిట్‌ కొట్టి మళ్ళీ ఫామ్‌లోకి వచ్చారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిన శింబు చేస్తోన్న సినిమాల్లో ఒకటైన ‘ఇదు నమ్మ ఆలు’ ఒకటి. శింబుకు మంచి ఫ్రెండ్ అయిన నయనతార ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా విషయంలో నయనతారపై శింబు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో ఓ కంప్లైంట్ ఇచ్చారన్న ప్రచారం బాగా జరిగింది.

‘ఇదు నమ్మ ఆలు’కు డేట్స్ ఇవ్వకుండా నయనతార తమను ఇబ్బంది పెడుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అవన్నీ గాళి వార్తలేనని శింబు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సినిమాకు ఓ నిర్మాత అయిన తన తండ్రి రాజేందర్, నయనతార డేట్స్ అడ్జెస్ట్‌మెంట్స్ విషయమై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌ను సంప్రదించారని, ఈ విషయంలో ఎవరూ ఎవరిపై కంప్లైంట్ ఇవ్వలేదని శింబు తెలిపారు. ఇక నయనతార తనకు మంచి ఫ్రెండ్ అని శింబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు