‘పుష్ప’ పోలీస్ పాత్రలో శింబు ?

Published on Jan 18, 2021 8:00 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమాలో మొదట తమిళ హీరో విజయ్‌ సేతుపతి ఓ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించాలి. విజయ్ కూడా ఆ పోలీస్ పాత్రలో నటిస్తా అని కమిట్ అయ్యాడు. కానీ కరోనా కారణంగా షెడ్యూల్స్ అన్ని మిస్ అయి.. డేట్స్ అన్ని క్రాస్ అయి మొత్తానికి విజయ్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ఇప్పుడు ఈ పాత్రలోనే మలయాళ హీరో శింబును తీసుకోవాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలా నటిస్తోంది.

కాగా స్టార్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటికే ఈ సినిమా కోసం ఈ పాటను కూడా రికార్డ్ చేశారట. ఎప్పుడూ బిజీగా ఉండే దేవీ శ్రీ, ఈసారి కూల్‌గా తీరిగ్గా కూర్చుని మ‌రీ పుష్ప సినిమాకి ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాడు. ముఖ్యంగా సుక్కు- దేవీ కాంబినేష‌న్‌లో ఐటం సాంగ్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలాగే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఈ సినిమాలో ఓ గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది.

సంబంధిత సమాచారం :