పూరి జగన్నాధ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ 2015లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. తాజాగా ఈ చిత్రాన్ని హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. రణ్వీర్ సింగ్ హీరోగా ‘సింబా’ అనే టైటిల్ తో బాలీవుడ్ లో రీమేక్ అవుతుంది. ఈచిత్రం యొక్క సగ భాగం షూటింగ్ హైదరాబాద్లోని రామోజీఫిల్మ్ సిటీ లోనే జరిగింది.
ఇక ఈ చిత్ర ట్రైలర్ ను డిసెంబర్ 3న విడుదలచేయనున్నారని సమాచారం. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో సారా అలీ ఖాన్ కథానాయికగా నటిస్తుండగా సోనూసూద్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, రోహిత్ శెట్టి కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 28న ప్రేక్షకులముందుకు రానుంది.


