
యువ సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ హీరోగా ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ సినిమా ‘త్రిష ఇలియాన నయనతార’. ఆనంది హీరోయిన్. ప్రేక్షకులలో కేవలం టైటిల్ తో ఆసక్తి రేపిన ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ కీలక పాత్రలో నటిస్తుంది. ఇటివలే దర్శకుడు ఆమెను కలిసి కథను వినిపించారు. సిమ్రాన్ ఓకే చెప్పారు.
మార్చి రెండవ వారం నుండి సిమ్రాన్ షూటింగులో పాల్గొంటుందని సమాచారం. గత ఏడాది ‘ఆహా కళ్యాణం’ సినిమాలో సిమ్రాన్ అతిధి పాత్రలో నటించింది. ఈ సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ లో నటిస్తుందట. సుమారు ఆరేళ్ళ విరామం తర్వాత సిమ్రాన్ ఓ తమిళ సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్లో సందడి చేయనుంది.

