ఆ హీరోయిన్ సోయగమంతా ఏమైంది…?

Published on Sep 16, 2019 1:13 pm IST

తెలుగులో ఏళ్ల తరబడి టాప్ హీరోయిన్ గా కొనసాగిన తారలతో సిమ్రాన్ ఒకరు. తెలుగులో ఒకప్పుడు అందరి టాప్ హీరోల ఫస్ట్ ఛాయిస్ సిమ్రానే. చిరంజీవి,బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అందరూ టాప్ స్టార్స్ తో నటించిన ఆమె బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు నమోదు చేశారు. సౌత్లో ముఖ్యంగా తెలుగు, తమిళ భాషలలో ఆమె ఎక్కువ చిత్రాలు చేశారు.అలాగే హిందీలో కూడా ఆమె చాలా చిత్రాలలో నటించడం జరిగింది.

అందం అభినయంతో పాటు, కళ్ళు తిప్పుకోలేని డాన్స్ మూవ్మెంట్స్ సిమ్రాన్ ప్రత్యేకత. ఈ పొడుగుకాళ్ల సుందరి డాన్స్ ల కోసమే అభిమానులు థియేటర్లకు వెళ్లేవారంటే అతిశయోక్తికాదు. ప్రొఫెషనల్ డాన్సర్ అయిన సిమ్రాన్ భరత నాట్యం, సాల్సా లలో ప్రావీణ్యం కలదు. కాగా తన లేటెస్ట్ ఫోటో ఒకటి ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. నెరిసిన జుట్టుతో మేకప్ లేకుండా ఉన్న సిమ్రాన్ ని చూస్తే నాటి ఆమె సోయగమంతా ఏమైందన్న భావన కలుగక మానదు. ఒకప్పుడు గ్లామర్ కి కేర్ ఆఫ్ గా ఉన్న సిమ్రాన్ చూస్తే బాధపడేలా ఆమె ఉన్నారు. 2003లో సిమ్రాన్ వివాహం జరిగాక కూడా తెలుగులో అడపాదడపా చిత్రాలలో నటించారు. ఐతే ఆమె తమిళంతో మాత్రం తన వయసుకు తగ్గ పాత్రలను విరివిగా చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More