ట్రెండింగ్ లో ‘సింగ్ గీతం’.. ఏకంగా ఆరవ స్థానం !

దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’ అనే ఆసక్తికరమైన చిత్రానికి దర్శకత్వం వహించారు. థియేటర్లలో విజయవంతమైన ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో దుఅంబాటులోకి ఉంది. ఐతే, ఈ సినిమా విస్తృత ప్రేక్షకాదరణ పొందుతూ.. నెట్‌ ఫ్లిక్స్‌ లో ఆరవ స్థానంలో ట్రెండ్ అవుతోంది. తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర బాషా ప్రేక్షకులు కూడా ఈ వినూత్న కథతో మమేకం అవుతుండటంతో సోషల్ మీడియాలో దీనిపై భారీ చర్చ జరుగుతోంది. మొత్తానికి ఈ చిత్రంలోని సృజనాత్మకతను ప్రేక్షకులు ఎంతగానో అభినందిస్తున్నారు.

దీంతో, ఒక ప్రాంతీయ చిత్రంగా మొదలైన ఈ ప్రాజెక్ట్, ఇప్పుడు జాతీయ స్థాయి విజయం సాధించిన సినిమాగా నిలిచింది. వైజయంతీ మూవీస్ మరియు స్వప్న సినిమా వంటి ప్రముఖ నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో రూపొందిన ఈ చిత్రంలో తులసి శివమణి, బెనర్జీ, శివ నారాయణ మరియు అగు స్టాన్లీ చిడోజీ కీలక సహాయక పాత్రల్లో నటించారు. లిమిటెడ్ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Exit mobile version