టాలీవుడ్ వెటరన్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘సింగ్ గీతం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. 94 ఏళ్ల వయసులో ఈ లెజెండరీ డైరెక్టర్ మరోసారి తనదైన క్రియేటివ్ పద్ధతిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎలాంటి డైలాగులు లేకుండా, మొత్తం పాటల రూపంలో ఈ సినిమా సాగనుండటంతో ఈ చిత్రం ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి టాలీవుడ్ ప్రేక్షకుల్లో నెలకొంది.
ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా సెన్సార్ పనులు కూడా ముగిశాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 17 నిమిషాలుగా లాక్ చేశారు మేకర్స్. మరోసారి తనదైన ప్రయోగాత్మక చిత్రంగా ‘సింగ్ గీతం’ను మన ముందుకు తీసుకొస్తున్నారు ఈ సీనియర్ డైరెక్టర్.
ఈ సినిమాలో అయాన్, అహిల్య బమ్రూ, శాలినీ కొండెపూడి, శివ నారాయణ, తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా నాగ్ అశ్విన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.



