రిలీజ్ డేట్ మార్చుకున్న ‘సింగ్ గీతం’.. కొత్త డేట్ ఇదే..!

రిలీజ్ డేట్ మార్చుకున్న ‘సింగ్ గీతం’.. కొత్త డేట్ ఇదే..!

Published on Jun 9, 2026 9:51 PM IST

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న వైవిధ్యభరిత చిత్రం ‘సింగ్ గీతం’ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను నాగ్ అశ్విన్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ చిత్రానికి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. అయితే, ఈ చిత్ర రిలీజ్ డేట్‌లో మార్పు చోటు చేసుకుంది.

ఈ చిత్రాన్ని తొలుత జూన్ 11న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేశారు. అయితే, ఇప్పుడు ఒక రోజు ఆలస్యంగా ఈ చిత్రాన్ని జూన్ 12న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. విజువల్ ఎఫెక్ట్స్ పనుల ఫైనల్ టచ్-అప్స్ కోసం చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కథలో విజువల్స్ మరియు గ్రాఫిక్స్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుండటంతో, ఎక్కడా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రంలో అయాన్, అహిల్య, శాలినీ కొండెపూడి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

తాజా వార్తలు