1 మిలియన్ వ్యూస్‌తో.. ‘సింగం 123’!

1 మిలియన్ వ్యూస్‌తో.. ‘సింగం 123’!

Published on Jul 2, 2015 7:12 PM IST

Singam-123
‘సింగం 123’.. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా, మంచు విష్ణు నిర్మాణంలో తెరకెక్కిన ఔట్ అన్డ్ ఔట్ స్పూఫ్ కామెడీ సినిమా. జూన్ 5న విడుదలైన ఈ సినిమా, విడుదలై సరిగ్గా పదిరోజులు కాగానే నిర్మాత విష్ణు యూట్యూబ్‌లో ఉచితంగా పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా ఏ సినిమా అయినా విడుదలైన కొన్ని నెలల తర్వాత అఫీషియల్‌గా ఆన్‌లైన్లో ఉంచేలా నిర్మాతలు ప్లాన్ చేస్తూంటారు. అయితే ‘సింగం 123’ విడుదలైన పది రోజులకే ఆన్‌లైన్లో ప్రత్యక్షమయింది.

కొత్త దర్శకుడు అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్‌లో రూపొందింది. మంచు విష్ణు బ్యానర్ నుంచి వచ్చిన సినిమా కావడం, సంపూర్ణేష్ బాబుకున్న క్రేజ్, అందరినీ విపరీతంగా అలరించిన ట్రైలర్ లాంటి అంశాలన్నీ ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టాయి. మొదటి వారంలోనే పెట్టిన బడ్జెట్‌తో పాటు కొంత లాభాలను కూడా ఈ సినిమా తెచ్చిపెట్టింది. ఇక సినిమాపై క్రేజ్ ఉండగానే ఆన్‌లైన్లో విడుదల చేయగా, యూట్యూబ్‌లో ఈ సినిమా విడుదలైన రెండు వారాల్లోనే పది లక్షలకు పైనే వ్యూస్ సాధించి సినిమాకున్న క్రేజ్‌ను మరోసారి ఋజువు చేసింది.

తాజా వార్తలు