వైర ముత్తు పై మరో మారు మండిపడిన చిన్మయి.

Chinmayi

సింగర్ చిన్మయి శ్రీపాద మరోమారు తమిళ రచయిత వైర ముత్తుపై మండిపడ్డారు. తొమ్మిది మంది మహిళలను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలున్న తమిళ సినీ కవి వైర ముత్తుపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా.. గౌరవిస్తూ సత్కరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోపణలు ఎదుర్కొన్నవారికి ఏమీ కాదు. ఆరోపణలు చేసిన వారికే పని దొరక్కుండా చేస్తారు. తమిళ భాష పట్ల వైర ముత్తుకు ఉన్న పట్టును గుర్తించి ఈ డాక్టరేట్ ఇస్తున్నారని నాకు తెలుసు. అదే విధంగా ఉత్తమ కామాంధుడు అనే పురస్కారం కూడా ఇస్తారని ఆశిస్తున్నా’ అంటూ సింగర్ చిన్మయి ట్వీట్ చేశారు.

లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న రచయిత వైర ముత్తు పై చిన్మయి అలుపెరగని పోరాటం చేస్తుంది. కాగా ఈ ఏడాది బెస్ట్ సింగర్ గా చిన్మయి ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ చి ల సౌ చిత్రానికి గాను బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరిలో జాతీయ అవార్డ్స్ అందుకున్నారు.

Exit mobile version