ప్రతి ఒక్కరికీ రిప్లై ఇవ్వడం నా పనికాదు !

Published on Jun 16, 2019 3:00 pm IST

ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటంలో ప్రముఖ గాయని చిన్మయి ఎప్పుడూ ముందే ఉంటారు. ఇక ఆమె సోషల్‌ మీడియాలో కూడా వెరీ యాక్టివ్ గా ఉంటారు. అయితే నెటిజన్లు కూడా ఆమెకు ఎప్పటికప్పుడు మెసేజ్ లు చేస్తూ.. ఎప్పుడూ టచ్ లో ఉంటారు. అయితే ఓ అభిమాని ఆమెకు అసభ్యకర పదజాలంతో మెసేజ్ లు చేసి.. చివరిల్లో ఇలా మాట్లాడితే మీరు రిప్లై ఇస్తారని అనుకున్నానని అందుకే అలా మెసేజ్ చెయ్యాల్సి వచ్చిందని అన్నాడట.

కాగా ఆ మెసేజ్ లను చిన్మయి స్క్రీన్‌ షాట్‌ తీసి షేర్‌ చేస్తూ.. రిప్లై ఇవ్వకపోతే అభిమాని ఇలాంటి మెసేజ్‌లు చేస్తాడా ? అని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ కి మరో నెటిజన్‌ స్పందిస్తూ.. ‘ఇలాంటి మెసేజ్‌ లను షేర్‌ చేసేందుకు మీకు సమయం ఉంది. కానీ హాయ్‌.. థాంక్యూ అని రిప్లై ఇవ్వడానికి మీకు సమయం లేదా’ అని రిప్లై పెట్టాడు. ఈ మెసేజ్ గురించే చిన్మయి మాట్లాడుతూ.. ‘నాకు రోజుకు నాకు వెయ్యికి పైగా మెసేజ్‌ లు వస్తాయి. అన్ని మెసేజ్ లకు ప్రతి ఒక్కరికీ రిప్లై ఇవ్వడం నా పనికాదు’ అని చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :

More