ప్రముఖ గాయని మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత ఉపద్రష్ట కిరీటంలో మరో కలికీతురాయి జతకలిసింది. గుంటూరు లో ఎన్.టి.ఆర్ ట్రస్ట్ నిర్వహించిన వేడుకలో ఈమెకు ఎన్.టి.ఆర్ మెమోరియల్ అవార్డుని బహుకరించారు. అలనాటి అందాల తార వాణిశ్రీ చేతులమీదుగా సునీత ఈ అవార్డుని అందుకుంది. ఎన్నో అవార్డులను అందుకున్న సునీత ఈ అవార్డు తనకెంతో ప్రత్యేకమని తెలిపింది.
అవార్డు అందుకున్న ఆనందంలో సునీత తన సోషల్ నెట్వర్కింగ్ పేజ్ లో ‘నేనెప్పుడూ చెప్పే మాటే అయినా మరోసారి చెప్తున్నా… నాపై మీకున్న ప్రేమ కారణంగానే ఇది సొంతమైంది… నా తరుపున వున్న అందరికీ నేను రుణపడి వుంటాను.. కెరీర్ లో మరో ఆనందకరమైన సమయం.. గుంటూరులో ఎన్.టి.ఆర్ మెమోరియల్ అవార్డుని అందుకున్నాను’ అని పోస్ట్ చేసింది.


