ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌లో మ‌రో ట‌ర్న్ తీసుకుంటున్న సింగర్ సునీత..?

Published on Jun 30, 2021 10:04 pm IST


ఇటీవ‌ల దాంప‌త్య జీవితంలోకి అడుగుపెట్టిన పాపుల‌ర్ ప్లే బ్యాక్ సింగ‌ర్ సునీత త‌న ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌లో మ‌రో ట‌ర్న్ తీసుకోబోతున్నట్టు సమాచారం. బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్న ఆమె త్వరలో ఆయనతో కలిసి నిర్మాణ రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తుంది. ఇటీవ‌లే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఏక్ మినీ క‌థ చిత్రంతో సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన రామ్ వీరపనేని త్వరలోనే ఓ వెబ్సిరీస్ను చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే దీనికి సంబంధించిన బాధ్యతలను సునీత స్వయంగా పర్యవేక్షించనున్నారని సినీ వ‌ర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. అయితే కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వెబ్‌సిరీస్‌లకు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించనున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇదేకాకుండా ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించిన ఐకానిక్ మ్యూజిక‌ల్ షో ‘పాడుతా తీయ‌గా’కు కూడా న్యాయ‌నిర్ణేతగా వ్య‌వ‌హ‌రించ‌నుంది.

సంబంధిత సమాచారం :