అనుకున్నట్టుగానే సంపూర్నేష్ బాబు ‘సింగం 123’ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో భారీ ఓపెనింగ్స్ సాధించింది. ‘సింగం 123’ తో పాటు మరో రెండు చిత్రాలు విడుదల అయిన మంచు విష్ణు నిర్మించిన ఈ చిత్రం భారీగా ప్రేక్షకులని ధియేటర్లకు రాబట్టుకుంది.
ఆశక్తికరమైన విషయం ఏమిటంటే సింగల్ స్క్రీన్స్ వున్న చిన్న ప్రాంతాలలో కూడా ఈ చిత్రం బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ సాధించింది. ఈ చిత్రంలోని డైలాగులు హైలైట్ కాగా ఫన్నీ విష్ణు రాసిన ఫన్నీ స్టొరీ లైన్ కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది.
‘సింగం 123’ చిత్రాని మంచు విష్ణు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించారు.


