ఫ్యాన్స్ కి మహేష్ ఇండిపెండెన్స్ డే గిఫ్ట్ అదిరిందిగా

Published on Aug 15, 2019 8:02 am IST

సూపర్ స్టార్ మహేష్ ఊహించని విధంగా ఫ్యాన్స్ కి ఇండిపెండెన్స్ డే ట్రీట్ ఇచ్చారు. దేశరక్షణ కోసం, ప్రజల క్షేమం కోసం బలిదానం అవుతున్న వీర సైనికుల త్యాగనిరతికి గుర్తుగా ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రంలోని టైటిల్ సాంగ్ విడుదల చేశారు. “భగభగ మండే నిప్పుల వర్షమొచ్చినా, జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు” అంటే మొదలయ్యే ఆ సాంగ్ భారత సైన్యం పాల్గొన్న కొన్ని చారిత్రాత్మక ఘట్టాలను స్మరించుకుంటూ సాగి, దేశభక్తిని పెంపొందించేదిగా ఉంది. ఈ సాంగ్ చివరలో మహేష్ ఆర్మీ మేజర్ గెటప్ లో ఉన్న కొన్ని కొత్త లుక్స్ కూడా చూపించడం జరిగింది.

‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీలో మహేష్ అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే చిత్ర యూనిట్ వీర సైనికుల త్యాగాలకు గుర్తుగా ఈ సాంగ్ విడుదల చేయడం జరిగింది. మహేష్ కు జంటగా రష్మిక మందాన నటిస్తున్న ఈ చిత్రంలో విజయ శాంతి, రాజేంద్రప్రసాద్ వంటి నటులు ఇతర కీలకపాత్రలు చేస్తున్నారు. దిల్ రాజు, మహేష్, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇక రాక్ స్టార్ దేవీశ్రీ సంగీతం అందిస్తున్నారు.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :