‘అల్లు అర్జున్’కి సిస్టర్ సెంటిమెంట్ !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న సినిమా కథకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త తెలిసింది. సహజంగానే తన సినిమాల్లో ఎమోషన్ని కాస్త ఎక్కువుగానే ఉండేలా చూసుకుంటాడు త్రివిక్రమ్. అయితే ఈ సారి ఎమోషన్నే హైలెట్ చేస్తూ.. బన్నీ కోసం మంచి సిస్టర్ సెంటిమెంట్ కథ రాశాడట. రెగ్యులర్ సినిమాల్లో లాగా రెండు ఎమోషనల్ సీన్స్, నాలుగు డెప్త్ డైలాగ్ లతో చెల్లి సెంటిమెంట్ ను పండించడం కాకుండా.. ఇన్సిడెంట్స్ రూపంలో మొత్తం కథే చెల్లి పాత్ర చుట్టూ తిరిగేలా కథ రాశాడట.

దీనికితోడు సినిమాలో అల్లు అర్జున్ ను త్రివిక్రమ్ కాస్త వైవిధ్యంగా చూపించబోతున్నాడని సమాచారం. బన్నీ డ్రెసింగ్ స్టైల్ దగ్గర నుంచి హెయిర్ స్టైల్ వరకూ ఈ సినిమాలో కొత్త బన్నీ కనిపించేలా త్రివిక్రమ్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఈ సినిమలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే త్రివిక్రమ్ తో ‘అరవింద సమేత’కి, అలాగే బన్నీతో డీజే సినిమాకి పనిచేసింది.

అలాగే ఈ సినిమాలో సుశాంత్, నవదీప్ లు కూడా నటిస్తున్నారు. అన్నిటికి మించి ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి తల్లిగా ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు నటిస్తోంది. ఈ సినిమాను అల్లు అరవింద్ తో కలిసి చినబాబు నిర్మించనున్నారు.

Exit mobile version