నాగ చైతన్య సినిమాలో హైలెట్ సిస్టర్ సెంటిమెంట్ !

చందు మొండేటి దర్శకత్వంలో వస్తోన్న ‘సవ్యసాచి’ సినిమాలో భూమిక నాగ చైతన్య సోదరి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. తన అక్కకు జరిగే అన్యాయాన్ని ఎదిరించే పాత్రలో చైతు కనిపించబోతున్నట్లు సమాచారం. భూమిక, చైతు మద్య వచ్చే సన్నివేశాలు బాగా వచ్చాయని, సినిమా మొత్తంలో సిస్టర్ సెంటిమెంట్ హైలెట్ కాబోతోందని వినికిడి.

నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఆర్.మాధవన్, రావు రమేష్, వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు యువరాజ్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. జూన్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.