సీత విడుదల వాయిదాపడింది !

Published on Apr 21, 2019 9:15 am IST

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సీత’ విడుదల వాయిదాపడింది. ఈచిత్రం ఈనెల 25న విడుదలకావాల్సి వుంది. అయితే అదే రోజు ఎవెంజర్స్ -ఎండ్ గేమ్ భారీ స్థాయిలో విడుదలవుతుండడం అలాగే ఇప్పటికే జెర్సీ, కాంచన 3 చాలా థియేటర్లలో సందడి చేస్తుండడంతో సీత కు థియేటర్లు దొరకడం లేదు.

అందుకే ఈ సినిమా విడుదలను వచ్చే నెల కు వాయిదా వేశారని సమాచారం. తేజ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మన్నార చోప్రా , సోనూసూద్ ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

ఏకే ఎంటర్టైమెంట్స్ పతాకం ఫై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రం యొక్క థియేట్రికల్ హక్కులు 18కోట్లకు అమ్ముడైయ్యాయని టాక్. మరి ఈ చిత్రంతోనైనా సాయి శ్రీనివాస్ హిట్ కొడతాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :