సీత థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాత !

Published on Apr 15, 2019 1:20 pm IST

కవచం తరువాత యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సీత’ షూటింగ్ ను పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రం యొక్క థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ భారీ ధరకు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన, అనిల్ సుంకర తో కలిసి గోపిచంద్ తో ఓ సినిమాని నిర్మిస్తున్నాడు.

ఇక ఈ చిత్రాన్ని కూడా ఏకే ఎంటర్టైమెంట్స్ పతాకం ఫై అనిల్ సుంకరే నిర్మిస్తున్నాడు. మన్నార చోప్రా , సోనూసూద్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ చివరి వారంలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు వున్నాయి.

సంబంధిత సమాచారం :