హీరోయిన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణలు కోరిన శివాజి!

హీరోయిన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణలు కోరిన శివాజి!

Published on Dec 23, 2025 6:58 PM IST

Sivaji

నటుడు శివాజి ఇటీవల చేసిన వివాదాస్పద కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినీ పరిశ్రమలోని వారు, మహిళలు ఆయనపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆయన చేసిన కామెంట్స్ మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ పలువురు ఆయనపై మండిపడ్డారు. దీంతో నెట్టింట శివాజి వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగింది.

చివరకు ఆయనపై మా అసోసియేషన్‌లో ఫిర్యాదు కూడా నమోదైంది. దీంతో తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరుతూ శివాజి తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు. మహిళల పట్ల తనకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని.. అయితే, కొందరు కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడటం చూసిన తాను వారి మంచి కోసమే ఆ కామెంట్స్ చేశానని.. కానీ, తాను వాడిన పదాలు తప్పు అని.. అందుకే మహిళలందరికీ తాను క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. దీంతో ఈ వివాదం ముగిసినట్లు అయింది.

ఇక శివాజి, నవదీప్, బిందు మాధవి ముఖ్య పాత్రల్లో నటించిన ‘దండోరా’ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు