ఘనంగా జరిగిన ‘శివకాశీపురం’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ !
Published on Jul 29, 2018 2:00 pm IST


ప్రముఖ సంగీత దర్శకులు చక్రవర్తి మనవడు, శ్రీ తనయుడు రాజేష్‌ శ్రీ చక్రవర్తిని హీరోగా పరిచయమవుతున్న చిత్రం శివకాశీపురం. మాస్టర్‌ హరి సమర్పణలో సాయి హరీశ్వర ప్రొడక్షన్స్‌ పతాకం ఫై మోహన్‌బాబు పులిమామిడి నిర్మించిన ఈచిత్రాన్ని నూతన దర్శకుడు హరీష్‌ వట్టికూటి తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగష్టు 3న విడుదల కానుంది .

ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను నిర్వహించింది. ప్రముఖ నిర్మాతలు కె.వి.వి.సత్యనారాయణ, రాజ్‌ కందుకూరి, రుద్రరాజు పద్మరాజు, నల్లమోతు శ్రీధర్‌ అతిథులుగా విచ్చేసి చిత్రంలోని పాటలను, ట్రైలర్‌ను, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఇంకా ఈఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు తదితరులుపాల్గొన్నారు .

ఈ సంధర్బంగా రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ ‘శివకాశీపురం’ అనే టైటిల్‌ నాకు బాగా నచ్చింది. సైకలాజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ చూశాను. చాలా బాగుంది. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook