వాయిదా పడిన అనుష్క ‘సైజ్ జీరో’ ఆడియో రిలీజ్

వాయిదా పడిన అనుష్క ‘సైజ్ జీరో’ ఆడియో రిలీజ్

Published on Sep 6, 2015 1:18 PM IST

Size-zero

ఈ ఏడాది సౌత్ ఇండియన్ ఆడియన్స్ ని రెండు డిఫరెంట్ లుక్స్ లో థ్రిల్ చేసిన హాట్ బ్యూటీ అనుష్క అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పటికే రిలీజ్ అయిన ‘బాహుబలి’ సినిమాలో అనుష్క మునుపెన్నడూ కనిపించని డీ గ్లామర్ లుక్ లో కనిపించి అందరినీ షాక్ చేసింది. ఈ సినిమా తర్వాత అనుష్క చేసిన లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘సైజ్ జీరో’. ఈ సినిమాలో అనుష్క బాగా లావుగా బొద్దుగా ఉన్న లుక్ లో కనిపించనుంది. ఈ సినిమా పోస్టర్స్ ద్వారా రిలీజ్ చేసిన అనుష్క లుక్ అందరినీ షాక్ అయ్యేలా చేస్తే, ఫస్ట్ టీజర్ మాత్రం అందరినీ బాగా ఎంటర్ టైన్ చేసింది.

ఈ చిత్ర టీం సైజ్ జీరో ఆడియోని సెప్టెంబర్ 6న కౌలాలంపూర్ లో రిలీజ్ చేయ్యాలనుకున్నారు, కానీ కౌలాలంపూర్ వెన్యూని కాన్సల్ చేసి హైదరాబాద్ కి షిఫ్ట్ చేసారు. తాజాగా ఆడియో రిలీజ్ నే వాయిదా వేసారు. అనుకున్నదాని ప్రకారం ఈ చిత్ర ఆడియో రిలీజ్ ఈ రోజు హైదరాబాద్ లోజరగాలి . కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆడియో రిలీజ్ ని వాయిదా వేసినట్లు ఈ చిత్ర టీం తెలిపింది. త్వరలోనే ఈ మూవీ న్యూ ఆడియో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు. ప్రకాష్ కోవెల మూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుష్కతో పాటు ఆర్య, సోనాల్ చౌహాన్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
పివిపి బ్యానర్ పై ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు